26, మార్చి 2009, గురువారం

శుభాకాంక్షలు

అందరికీ నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

11, మార్చి 2009, బుధవారం

రాకోయి.......

ఇదిగో... ఈరోజు ఎలాగైనా కొత్త పోస్ట్ చెయ్యాలని తీరిక చేసుకుని కూర్చున్నాను. అసలే సమ్మర్ ,ఎండలు మండి పోతున్నాయి. ఇంట్లో వాళ్ళంతా సెలవు రోజని రెస్ట్ తీసుకుంటున్నారు .ఇక నన్ను disturb చేసే వారుండరు అనుకుంటూ రాయడం మొదలెట్టాను.రెండు నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మ్రోగింది .తలుపు తెరవగానే "అమ్మయ్య ఇంట్లోనే ఉన్నారు కదా.ఆయినా ఈ ఎండలో బయటికేలా వెళ్తారు?ఏదో పని మీద ఈ పక్కకు వచ్చాను,అంతా నిద్రపోతున్నట్టున్నారు? "....వారు మా దూరపు బంధువులు .అదిగో అలా ఒక సెలవు రోజు గడిచిపోయింది.
ఇలా చాలామంది ఉంటారు.వాళ్లకు సెలవు రోజున తోచకుంటే మన సెలవురోజు త్యాగం చెయ్యాల్సిందే.ఒకసారైతే ఒకరోజైతే పరవాలేదు.ఎప్పుడు ఇదే తంతు.సెలవే కానక్కరలేదు. మనకు కూడా చాల పనులుంటాయి ఒక్కో సారి ఇలా అనుకోని అతిధుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి .మాములుగా అయితే ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తాము.కానీ ప్రతిసారీ ఇదే తంతు అయితే ఎలా?
మనమంతా ఈ రోజుల్లో చాల అడ్వాన్సు అయిపోయాం.పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్స్ వాడుతున్నాం.అనుకోని అతిధులుగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు మనని సాదరంగా ఆహ్వానించడానికి రెడీ గా ఉంటారు కదా ?అన్తే కాదు వాళ్ళు ఇంటి దగ్గర లేక పొతే అంత దూరం వెళ్లి ఉస్సూరు మంటూ వెనక్కి తిరగడం తప్పు తుంది కదా .
వస్తామని చెప్పి వెళ్ళలేక పోయినప్పుడు,కారణాంతరాలవల్ల ఆలస్యం అయినప్పుడు కూడా మరో చిన్న ఫోనేకాల్ చేసి తెలియపరచడం మరీ మంచిది .అవతలి వాళ్ళు పనులు మానుకుని ఎదురు చూస్తారు కదా?
ఇది రాయడం ఎవరినీ ఉద్దేశ్య పూర్వకంగా నొప్పించాలని కాదు.ఎదుటి వారు మన గురించి" రాకోయి అనుకోని అతిధి..". అని అనుకోకూడదని మాత్రమె.ఇప్పుడు కాకి చేత కబురు పంపడాలు లేవు కాబట్టి ఒక్క కాల్ తో కబురు పంపిద్దాం అని నా ఆలోచన మరి మీరేమంటారు ?
.