3, జనవరి 2010, ఆదివారం

ఎంత అవుదార్యం

ఏమో అను కున్నా కాని అమెరికన్లకు,వారి అవుదార్యానికి, చెయ్యెత్తి నమస్కారం చెయ్యాలి.ఎంత మంది ఇతర దేశాల వారు అక్కడ స్థిరపడి డాలర్లు సంపాదిస్తున్నా భరిస్తూ కలిసి ఉంటూ వారి దేశంలో ఉండనిస్తున్నందుకు.మన రాష్ట్రంలో అయితే సాటి తెలుగు వాడిని రాజధాని లో అడుగు పెట్టనివ్వము అని ఎంత గొడవ?ఇప్పుడే టీవీ లో చూసాం సంక్రాంతి శలవులకు ఊళ్లకు వెళ్ళిన సొంత రాష్ట్రం వారిని హైదరాబాద్ కి తిరిగి రానివ్వరట. ఎక్కడిదాకా పోతుంది ఈ విద్వేషం?(మళ్లీ మనకు అమెరికా లో ఈ recession మూలంగా restrictionsపెడితే ఎక్కడ లేని కోపాలు వస్తాయి .తిట్టుకుంటాం కూడా ).ఈ మాటలు విన్న మన ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోదు .తెలంగాణా వాళ్ళమని చెప్పుకోవాలన్నా సిగ్గుగా అనిపిస్తుంది ఈ మాటలు వింటే.మొన్న మహారాష్ట్ర లో ఇలాంటివి చూసి అసహ్యంగా అనిపించింది .మనం కూడా తీసి పోలేదు

2, జనవరి 2010, శనివారం

శుభాకాంక్షలు

మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .ఈ సంవత్సరం మనకి శాంతి ని,సంతోషాన్ని,సహనాన్ని ప్రసాదించాలని ఆ పరమాత్ముణ్ణి ప్రార్థిస్తూ
ఓం సహనావవతు , సహనుభునక్తు , సహా వీర్యంకరవావహై : తేజస్వి నావ ఆధితం అస్తు : మవిద్విసవహై ; ఓం శాంతి ,శాంతి ,శాంతి: