15, జులై 2010, గురువారం

ఇదీ అంతే .....అనే మన దౌర్భాగ్యం ..

ఏంటి ,సడన్ గా ఇంత గోల వినిపిస్తుంది?ఎవరో కొట్టుకున్తున్నట్టుగా ఉంది.అరె... మా ఇంటి గేటు ముందే ...ఇంత మంది గుమి గూడారేంటి?లక్ష్మమ్మ మాకొత్త
పని మనిషికదూ వాళ్ళందరి మధ్యలో ...అయ్యో .....తనని అలా నెట్టేస్తున్నారు ....ఎందుకు .?అయ్యో కింద పడిపోయింది..పరిగెత్తుకుని కిందికి వెళ్ళాను."చంపేస్తాం....
ఏమనుకుంటున్నవు మొన్నటిదాకా నేను పని చేసిన ఇంట్లో ..నేను మానేసి నెలన్నా కాక ముందే ...నువ్వు కులుక్కుంటూ వచ్చి పనిలో చేరతావా?".
అదుగో తను మా పాత పని మనిషి కాంతమ్మ .ఆ చుట్టూ లక్ష్మమ్మను తిడుతూ తోసేస్తున్న వాళ్ళు అంతా కాంతమ్మ బంధువులు ,స్నేహితులు.ఎందుకలా కొడుతూ తోసేస్తున్నారు తనని.నాకేమి అర్థం కాలేదు.నేను కల్పించుకోకుంటే వదిలేతట్టులేరు. అసలు సంగతి ఏంటి ? కాంతమ్మ దగ్గరికి వెళ్లి అడిగాను.లక్ష్మమ్మ మొదట సమాధానం చెప్పింది .ఏడుస్తూ...."చూడండమ్మా నేనేం చేశాను?ఈ కాంతమ్మ మానేసి నెల దాటింది,మళ్ళీ మళ్ళీ పిలిచినా పనిలోకి రాలేదని మీరు చెప్తేనే కదా నిన్నపనిలోకి వచ్చాను,
మీరు ఇబ్బంది పడతారని.నాకు నాలుగు డబ్బులు వస్తాయని. ఈ రోజుపొద్దున్నే మీ ఇంట్లోకి వస్తుంటే చూసిందట ఈ కాంతమ్మ నన్ను .వీళ్ళందరినీ పిలుచుకుని వచ్చి నన్ను ఎలా కొడుతున్నారో చూడండి,మీరే చెప్పండమ్మా వీళ్ళకి" అని నా వెనకాల నిలబడింది కొంచం ధైర్యం తేచ్చుకుని. నేనేదో అనేలోగానే కాంతమ్మ- "కోడతామా..చంపుతామా? నేను పని చేసే చోట్ల నువ్వేయ్లా చేస్తావే.?అని పై పైకి వచ్చింది."
"కాంతమ్మ ! ఆగు అలా మాట్లడతావేంటి.నాకు నువ్వు మానేస్తే చలా ఇబ్బంది.ఇంట్లో పని చేసుకుని ఆఫీసు కి పరిగెట్టాలంటే
చలా కష్టం. వచ్చి పనిలో చేరు ఇప్పటికైనా అంటే నువ్వే కదా కుదరదు అన్నావు. మళ్ళీ ఇదేంటి?", అడిగాను.
" అవును కుదరదన్నాను .నాకు ఇప్పటిలో పనికి రావడం కుదరదు. ఎప్పుడొస్తానో చెప్పలేను. ఎందుకంటే మా ఇంట్లో మాకు, మా ఆయన అన్నదమ్ములకు గొడవలు.అవన్నీ తేలితే తప్ప రాలేను."
"సరే నువ్వు రాలేదు అందుకే నేను కొత్త మనిషిని పెట్టుకున్నా."
"అదెట్లా కుదుర్తది. దాన్ని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వం . దాన్ని వెళ్లి పొమ్మని చెప్పమ్మా."
"మరి నువ్వు వస్తావా రేపటి నుంచి",అడిగాను.
"చెప్పిన కదమ్మా నాకు కుదరదు ఇప్పట్లో"
"ఇదెక్కడి గొడవ ? నువ్వు రాకుండా తనని ఆపితే మరి నా సంగతేంటి ?నాకు పని ఎవరు చేస్తారు? మధ్యలో నన్ను ఎటూ కాకుండా చేస్తే ఎలా", తీవ్రంగానే అడిగాను.
కాంతమ్మ నవ్వింది ....అది అంతేలే అమ్మ .నేను పని చెయ్యను .దాన్ని రానివ్వను. మళ్ళీ ఎన్ని నెలల తర్వాత వచ్చినా నన్నే పనిలో పెట్టుకొవాలి.
అంతే. నాకు మండి పోయింది.
"ఇది చాల too much ! ఒక పద్దతి లేదా..??? "
"ఎంటమ్మ పద్దతి ? అక్కడ MLA లు రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళనే ఎన్ను కోవాలని అంటుంటే ఏం చేస్తున్నారు. ఇది కూడా అంతే."
నాకు కళ్ళు తిగినబ్త పని అయింది .