27, నవంబర్ 2010, శనివారం

ప్లీజ్ మీరేమైనా సలహా ఇస్తారా ?

ప్లీజ్ మీరేమైనా సలహా ఇస్తారా ?






ఇది కొద్ది రోజుల క్రితం మాట ..... ఆ రోజు .....quarterly ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయని ..పరుగెత్తుకుని వచ్చిన .........మా పాప,బాబు ....
చాల ఆత్రంగా నా మొహం లోకి చూస్తున్నారు.ఈ సారి వాళ్ళ ప్రొగ్రెస్స్ కార్డు లో ఫస్ట్ రాంక్ చూసి ...ఎన్నెన్ని బహుమతులు ఇస్తానో అని. నిజం చెప్పాలంటే ఎప్పుడు చక్కగా చదువుతారు మాపిల్లలిద్దరు. ఒక్క చదువేంటి ? రోజు పొద్దుటే త్వరగా లేచి ,జాగింగ్, ఆతర్వాత చక చక తయారయ్యి న్యూస్ పేపర్ చదవడం....టీవీ లో వార్తలు చూసి gk పెంచుకోవడం .స్కూల్ నుండి ఇంటికి రాగానే స్పోర్ట్స్,..homework ...అన్ని పద్దతి ప్రకారం చేయడం ....వాళ్ళని చూసి నేను తెగ మురిసిపోవడం .....మామూలే.

మరి ఎందుకిలా....జరిగింది.?అస్సలుచదవటం మానేసి ...., ఈ పిచ్చిపనులు ఏంటి? స్కూల్ నుండి కూడా కంప్లైంట్స్ .ఏమైంది ...పట్టుమని పదేళ్ళు లేని మా అబ్బాయి ఆ పక్కన construction లో ఉన్న బిల్డింగ్ లో అస్తమానం దూరుతున్నాడు .ఆ పనివాళ్ళతో వీడికేమి పని?రోజస్తమానం సిమెంట్ ఇసకలో దొర్లుతున్నాడు .,ఎనిమిదేళ్ళ మా పాప ఇంట్లో గిన్నెలు తోముతాను గ్లాసులు కడుగుతాను,టీ కలుపుతాను అని ఒకటే గొడవ.చదువు జోలికి వెళ్ళటం లేదు ఇద్దరు...యింతకు మునుపు లాగ మంచి మార్కులతో ఇంజినీరింగ్ పాసయ్యి నెలకు 75000 వేల రూపాయల జీతం తో సెటిల్ అయిన మా అక్క కొడుకు ప్రస్తావన తేగానే ఇద్దరు మొహాలు చూసుకుని నవ్వుకుంటున్నారు.పిచ్చెక్కి పోయింది నాకు.
.ఈ రోజు స్కూల్ నుంచి రాగానే చురకలు తగిలించాలి ..ఉహు .. అలాకాదు. నెమ్మదిగానే బుజ్జగించాలి .....విషయం కనుక్కోవాలి.కొత్త స్నేహాలేమన్న మొదలయ్యయా..తెలుసుకోవాలి..వాళ్ళకిష్ట మైన chocholates కొనిపెట్టి నెమ్మదిగా మాటల్లోకి దించాను.మామూలే ..కొత్త ఫ్రెండ్స్ అసలు లేరు .మా అబ్బాయి నెమ్మదిగా చెప్పాడు: తాపీ పని నేర్చుకోవడానికి ఆ బిల్డింగ్ లోకి వెళ్తున్నాడట .. .తప్పకుండ నేర్చుకోవలసిందే అని...మా అమ్మాయి ముద్దుగా చెప్పింది టీ కలపడం తన ultimate గోఅల్'" అని ,ఎందుకు...? విస్తుపోతూ అడిగితే అప్పుడు చేసారు నాకుఇ గీతోపదేశం ..." అయ్యో అమ్మ నీకు తెలీదు ఒకసారి టీ కలిపితే 50000 రుపీస్ వస్తాయి.కప్పుల్లో టీ పోస్తే మరో 50000 రూపీస్ అంటే కాదు ఒక్కసారి సిమెంట్ తో ఇటుకలు పెడితే 100000 రూపీస్ ,ఇంకా బస్తాలు మోస్తే కూడా అంతే,మాస్చూల్ బాగ్స్ లాగే కదా అవి కూడా, పేపర్ చదవలేదా నువ్వు టీవీ లో చూడలేదా కూలి పనితీ అరగంట లో లక్ష సంపాదించిన నేతలు అని......ఎంత చదివిన అంట డబ్బు రాదు కాదమ్మా."బాగా చదువుకుని మంచి pilot ని అవుతాననే మాఅబ్బాయి ,డాక్టర్ అవుతాననే మా అమ్మాయి కూలీ పని చేసుకుంటా మని అంటున్నారు.అర గంటలో లక్షల్లో సంపాదించోచ్చని అనుకుంటున్నారు. .

నాకు బుర్ర గిర్రున తిరిగింది

gk పెంచుకోవడం కరెంటు affairs చదవడం అలవాటు చెయ్యడం ఎంత చేటుకొచ్చింది .ఇప్పుడు వీళ్ళను ఎలా దారికి తేవాలి .ప్లీజ్ మీరేమన్న సలహా ఇస్తారా?