7, డిసెంబర్ 2009, సోమవారం

ఎవరు వినలేదా?

ఈ మధ్యన ప్రతి టీవీ ఛానల్ లో ను తెలంగాణా ఉద్యమం గురించే . మొన్న ఒక రోజు టీవీ లో వస్తున్న ఒక (పేరు తెలీదు నాకు )పోలిటిసియన్ అన్న మాటలు మాత్రం చాల బాధను కలిగించాయి .



"మాకు ప్రత్యెక తెలంగాణా ఇవ్వకుంటే ఈ దేశం నుంచే వేరు పడతాం .ఇక ప్రత్యేక దేశం కోసం పోరాడుతాం "


ఈ మాటలు tv లో చాల సార్లు repeat టెలికాస్ట్ అయ్యాయి . ఇప్పటిదాకా ఎప్పుడు నేను ఇలాంటి మాటలు ఎలాంటి ఉద్యమకారుడు మాట్లాడగా వినలేదు .చాల seriuos గ తీసుకో వలసిన కామెంట్ ఇది . భారతదేశ సమైక్యతకు భంగం కలిగించే ఇలాంటి మాటలన్న వారిని ఎందుకు శిక్షించకూడదు .Suo motto action తీసుకోవాలి కదా .మరి ఈ మాటలు ఎవరిని కదిలిన్చలేదా ?కనీసం ఈ మాటలని ఖండించి అతని చేత క్షమాపణ చెప్పించి మల్లి ఇలాంటివి repeat అవకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం మీద ,అన్ని పొలిటికల్ పార్టీస్ మీద ఉంది కదా .మీలో కొందరైనా నాతొ ఏకీభవిస్తారా ?సామాన్య పౌరులం ఇలా అనుకోవడం తప్ప ఏమి చేస్తాం!

6 కామెంట్‌లు:

  1. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రేలాపనలు చేసేవాళ్లని శిక్షించడం కంటే యే పాపం ఎరుగని అమాయకులకు జరుగుతున్న నష్టాన్ని ఆపడం ముఖ్యం అండి. ఎవడో కౌన్ కిస్కా గొట్టంగాడు మాట్లాడిన ప్రసంగి మాటలకు రియాక్షన్ అక్కరలేదు. ఐతే దీన్నీ క్యాష్ చేసుకుంటున్న టివీ చేన్నెల్స్ నిజంగా నీతిమాలినవి!

    రిప్లయితొలగించండి
  2. అందరూ విన్నారు.

    ఉద్యమాల్లో ఇట్లాంటి మాటలు సహజమే అని లైట్ తీసుకున్నారు.
    ఆ మాట ఉద్యమకారుల్లో ఒక్కరికి కూడా స్ఫూర్తిని ఇవ్వలేదు
    అందుకే అది మరొకరి నోట ప్రతిధ్వనించలేదు.

    అయితే ఆ మాటల వెనక వున్న చారిత్రిక వాస్తవం, తెలంగాణాకు జరిగిన అన్యాయం మరొకసారి గుర్తు చేసుకునేలా చేసాయి.

    ఒక్కసారి గతం లోకి తొంగి చూడండి ...
    తెలంగాణా ఎప్పుడూ అంటే ముస్లిం ల కాలం లోనూ,
    బ్రిటీష్ కాలం లోనూ
    నేరుగా ధిల్లీ పాలనలో ఎప్పుడూ లేదు. (కప్పం కడుతూ నైనా సరే) ఎప్పుడూ స్వతంత్ర రాజ్యంగానే వుంది. ధిల్లీ గానీ మన జాతీయ నేతలు గానీ తెలంగాణాను ఎప్పుడూ పట్టించుకోలేదు కూడా.

    భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 1947 ఆగస్ట్ 15 నుంచి ఒక ఏడాదికి పైగా స్వతంత్ర దేశంగానే కొనసాగింది.
    దేశమంతా స్వాతంత్ర్యోద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న కాలం లో సైతం మహాత్మా గాంధి తెలంగాణలో ఒక్క బహిరంగ సభ అయినా నిర్వహిచలేదు. నిజాం రాష్ట్రం మీదుగా రైలు లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నిజాం సంస్థానం దాటే వరకు మౌన వ్రతం పాటించే వాడట.

    సరే ఇట్లాంటి మాటలు ప్రతీ ఉద్యమంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రతీ సందర్భంలో కనిపిస్తాయి.

    " తెలంగాణా ఏర్పడితే మీరంతా హైదరాబాదులో విదేశీయుల్లా బతకల్సోస్తుంది , మీకు కృష్ణా గోదావరి నీళ్ళు రావు తస్మాత్ జాగ్రత్త" అని తెలంగాణా ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రాలో, రాయల సీమలో డాక్టర్ సాబ్ అన్న మాటలు మీకు గుర్తు లేవా ???????

    వందే మాతరం గీతం పాదనివాడు ఈ దేశం విడిచి వెళ్ళాల్సిందే " అన్న గోడలమీది రాతలు మీరెప్పుడూ చూడలేదా ?????

    లైట్ తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  3. Yes - if corrupted leaders continue to ignore the fact - then revoking the fight for separate country is not too far.

    By the way, this initiative is not new either. There is a pending request for a separate country formation at United Nations.

    I guess it is time to seriously refresh that request.

    You people who are writing these useless blogs have no-idea or clue about separate Telangana state - so just shutup.

    Oh by the way, I don't sing Vande Matarm either.

    రిప్లయితొలగించండి
  4. అలాంటి మాటలు మాట్లాడటం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని తీస్తుందని దెబ్బ వాళ్ళు గ్రహిస్తే ఇంకేమి? అవి తెలీక మాట్లాడే మాటలు. లేకపోతే ప్రత్యేక దేశమేమిటి?

    సందీప్, మీ అభిప్రాయం బావుంది.

    రిప్లయితొలగించండి
  5. అసలు ఉద్యమం ఎందుకు చేస్తున్నారో సగం మంది ఉద్యమకారులకు తెలీదు. గొర్రెల్లాగా బస్సుల మీద పడ్డారు

    రిప్లయితొలగించండి