9, ఏప్రిల్ 2009, గురువారం

చిన్ని పాపయిలు .

మొట్ట మొదట ఏమి రాయాలి అనుకుంటే ముద్దులు మూటలు కట్టే చిన్నిపాపలే గుర్తు కొచ్చారు .చిన్ని చిన్ని పాపల్ని చూడ గానీ ఎవరికైనా అనిపిస్తుంది ఆడుకోవాలని ,గట్టిగ ముద్దుల్లో ముంచివేయాలని........
.మనకి భలే సంతోషం,ఇంకెంతో హాయి మరి పాపాయికి ...ఎలాఉంటుంది?చాల చికాకు గా ఉంటుంది .లేతబుగ్గలు కందిపోయి మంట పుడతాయి.అంతే కాదు ముచ్చటగా మూతి మీద ముద్దు పేట్టే వాళ్ళు కూడా ఉంటారు.తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు,దగ్గరి వాళ్ళు దూరపుచుట్టాలు.,పెద్దవాళ్ళు పిన్నవాళ్ళు అని లేకుండా ఎంత మంది చిన్న పాపాలని ముద్దులతో సతయిస్తారు ప్రతి రోజు.ఒక్క చిరాకే కాదు మనము పెట్టె ముద్దులతో ఎన్ని రకాల ఇబ్బందులు పాపాయికి?రకరాల INFECTIONS,స్కిన్ ప్రొబ్లెంస్ చిన్ని పాపాయి మీద దాడి చెయ్యచ్చు
నేను ఒక డాక్టర్ ని అయితే కాను.కాని ఒక తల్లిగా ఆలోచిస్తే మాత్రం ఇది ప్రతివాళ్ళు ఎదురు కునే సమస్య అనిపించింది.ఎందుకు నాకు తెలిసింది మీతో పంచుకోకూడదు అనిపించింది .మరి మీరేమి అంటారు?చిన్న విషయమే ఇది చెప్పు కోవడానికి,కాని చాల సమస్యలు రావడానికి కారణం కావచ్చు .నాకు అనిపించేది మాత్రం ప్రతి తల్లి ఈ విషయాన్ని గట్టిగ వ్యతిరేకించాలని ,అవతలి వాళ్ళు అర్థం చేసుకునేలా మెత్తగా చెప్పడానికి ప్రయత్నించాలి,మనకుపాపాయి ఆరోగ్యం ముక్ఖ్యం కదా.అంతే కాదు మన పాపలకు కూడా ఫ్లయింగ్ కిస్సేస్స్ ఇవ్వడం నేర్పించడం అన్ని విధాల మంచిది అని నా ఆలోచన మరి మీరేమి అంటారు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి