5, ఏప్రిల్ 2009, ఆదివారం

అమ్మ చేసె instant మాగాయ పచ్చడి........

బజారులో పచ్చి మామిడి కాయలను చూడగానే అమ్మ చేసె instant మాగాయ పచ్చడి గుర్తుకు వచ్చ్చింది.మా అమ్మ తప్ప మరెవ్వరు ఈ పద్దతిలో పచ్చడి చెయ్యడం చూడలేదు నేను.చాల తేలిగ్గా నిమిషాలలో చేసేది అమ్మ.మీ అందరితో తయారు చేసె విధానం పంచుకుంటే మీరూ రుచి చూసి ఎలా ఉందొ చెప్తారు కదా .....తప్పకుండ నచ్చుతుంది అనే నా నమ్మకం.
ఈ పచ్చడి కోసం రెండు మూడు పుల్లటి పచ్చి మామిడి కాయలు,తగినంత ఉప్పు ,పసుపు,కారప్పొడి,పావు టీ స్పూను వేయించిన మెంతుల పొడి,చిటికెడు చక్కర,తాలింపుకు రెండు టీ స్పూన్స్ నూనె ,తాలింపు గింజలు,ఇంగువ కావాలి.
మామిడి కాయలు చెక్కు తీసేసి మీడియం సైజు ముక్కలు చేసుకుని, తాలింపులోఉప్పు, పసుపు ,ఇంగువ ,వేసి వెంటనే మామిడికాయ ముక్కలు,ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి.మధ్య మధ్య కలుపుతూ ముక్కలు మగ్గి గుజ్జులాగా అవగానే మెంతి పిండి ,చక్కర,కారం , వేసి కల్పి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిచ్చిదింపెయ్యాలి .

మాగాయ పచ్చడి instant గా రెడీ . ఇది ఒక వారం రోజులు నిలవ ఉంటుంది
మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందొ చెప్పండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి